రసవత్తరంగా మారిన మూడో టెస్టు.. ముగిసిన నాలుగో రోజు ఆట

The third Test Forth day closed

సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. టీమిండియా నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 111 పరుగులు చేయాలి.

విజయం సాధించాలంటే భారత్‌ ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. మరోవైపు పీటర్సన్ (48 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లు షమీ, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. రేపు తొలి సెషన్‌లో వికెట్లను తీసిన దానిని బట్టి విజయం ఆధారపడి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో 198 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్ (100*) సెంచరీ చేసి జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. పంత్ కాకుండా విరాట్ కోహ్లీ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.