సాంబార్ రుచిగా చేయలేదని.. తల్లిని, చెల్లిని చంపేశాడు - TNews Telugu

సాంబార్ రుచిగా చేయలేదని.. తల్లిని, చెల్లిని చంపేశాడుThe young man killed his mother and sister
The young man killed his mother and sister

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. క్రూరత్వం పెరిగిపోయి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నిత్యం హృదయాన్ని కలిచి వేసే ఘటనలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటన కూడా అలాంటిదే. సాంబార్ రుచిగా లేదని అది వండిన తల్లిని, చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపుర్ తాలుకా దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతి, రమ్యలను మంజునాథ చంపేశాడు.

Illegal Firing In ayodhya Durga Pandal

పార్వతి కొడుకు మంజునాథ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తాగి ఇంటికి వచ్చాడు. తల్లి పార్వతి, చెల్లి రమ్య అన్నం వడ్డిస్తున్న సమయంలో తల్లి, చెల్లితో గొడవకు దిగాడు. వంట చేయడం కూడా రాదా అంటూ బూతులు తిట్టాడు. రోజూ తాగి వచ్చి సతాయిస్తున్న మంజునాథ్ తీరుకు విసుగు చెందిన పార్వతి, రమ్యలు మంజునాథ్ కి ఘాటుగానే బదులిచ్చారు. దీంతో మద్యం మత్తులో కోపోద్రిక్తుడైన మంజునాథ్ తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. పార్వతి, రమ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని.. స్థానికులు తెలిపారు. విషయం తెలియగానే ఇంటికి వచ్చి విగత జీవులుగా పడి ఉన్న భార్య, కూతురును చూసి కన్నీరు పెట్టుకున్న ఘటన స్థానికులను విషాదంలో ముంచేసింది. ఆ తర్వాత నేరుగా సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.