‘విద్యాసంస్థలు బంద్’ ప్రచారంలో నిజం లేదు: సబితా ఇంద్రారెడ్డి

telangana schools

కొవిడ్‌ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి విద్యా సంస్థలు బంద్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

తెలంగాణలో విద్యాసంస్థలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.

విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దవని ఆమె కోరారు. కరోనా వ్యాప్తి కట్టడికి విద్యాంస్థల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.