మోడీ ప్రకటనతో వెనక్కి తగ్గేది లేదు: రాకేశ్‌ టికాయత్

Rakesh-Tikait

హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ఆల్ ఇండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. వివాదస్పద సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేసి పార్లమెంట్​లో ఆమోదించాలనే డిమాండ్లతో రైతులు ధర్నా చేశారు. కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు.

‘‘మోడీ పెద్ద పెద్ద కంపెనీలకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు సంఘాలు అడిగిన ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం లేదు. కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. వాళ్ళు చెప్పేదే నడుస్తుంది.

భాష వేరు కావచ్చు.. కానీ రైతుల అందరి లక్ష్యం ఒకటే. ఆందోళనలు చేసే వారిని ప్రలోభాలకు గురి చేశారు. కానీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. మోడీ ప్రకటనతో వెనక్కి తగ్గేది లేదు.. ఆందోళన కొనసాగుతుంది.

పండించిన పంటకు మద్దతు ధరల చట్టం తేవాల్సిందే. సంయుక్త కిసాన్ మోర్చాలో విభేదాలు తెచ్చే కుట్రలు బీజేపీ చేస్తుంది. ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలి. దేశంలో నిరుద్యోగ సమస్యపై అందరం కలిసి పోరాడుదాం.’’ అని రాకేశ్‌ టికాయత్ పిలుపునిచ్చారు.