సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో దొంగల హల్చల్ - TNews Telugu

సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో దొంగల హల్చల్Thieves created havoc in Sangareddy district

సంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. అందోల్ మండల కేంద్రంలోని తాళాలు వేసిఉన్న ఐదు ఇండ్లలో గురువారు అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. సాక్ష్యాధారాలను కోసం క్యూస్‌ టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.