తిరుమల ఘాట్ రోడ్లు ఓపెన్.. రాకపోకలు యథాతథం

తిరుమల ఘాట్ రోడ్లు తెరుచుకున్నాయి. యథాతథంగా రాకపోకలు సాగుతున్నాయి. ఉదయం 10గంటలకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు.

వాహన దారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. దీంతో సాయంత్రం నుంచి ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.

అయితే అలిపిరి, శ్రీవారి మెట్లు కాలిబాట మార్గాలు వర్షాలకు దెబ్బతినడంతో వాటిని ఇంకా మూసే ఉంచారు. వరద ఉధృతితో మెట్లు కొట్టుకు పోవడంతో టీటీడీ మరమ్మతులు ప్రారంభించింది.