‘ఈ పుట్టుక నాది..’ ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్ వైర‌ల్

cm-kcr-with-mp-santhosh-kumar

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, హరిత ప్రేమికుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సంతోష్ కుమార్ ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు.

‘‘ఈ పుట్టుక నాది.. బ్ర‌తుకంతా మీది..’’ అని రాశారు. అయితే సీఎం కేసీఆర్.. చిన్నప్పటి సంతోష్ కుమార్‌ను భుజాల‌పై ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

ట్విట‌ర్ వేదిక‌గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోష్ కుమార్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.