‘సిరి వెన్నెల’ మరణానికి అసలు కారణం ఇదే

Behind story of death sirivennela

ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు చికిత్స అందించిన కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు .. సిరి వెన్నెల చనిపోవడానికి గల కారణాలను మీడియాకు వివరించారు.

ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగిందని, వారం క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ సోకండంతో దాంట్లోనూ సగం తీసేసినట్లు డాక్టర్ చెప్పారు.

రెండ్రోజులు బాగానే ఉన్నా.. ఆరోగ్య సమస్యలు తిరిగి రావడంతో అడ్వాన్స్ డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారన్నారు. కిమ్స్ లో రెండ్రోజులు ట్రీట్ మెంట్ అందిస్తే బాగానే రికవరీ అయ్యారన్నారు.

ప్రికాస్టమీ చేయడంతోపాటు 45 శాతం ఊపిరితిత్తు తీసేశామని, దీంతో మిగిలిన 55 శాతం లంగ్‌కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని డాక్టర్ వివరించారు. ఆక్సినేషన్‌ సరిగా లేక ఎక్మో మిషన్‌పై పెట్టామని, గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్‌పైనే ఉన్నారని డాక్టర్ చెప్పారు.

ఎక్మో మిషన్‌పై ఉన్న తర్వాత క్యాన్సర్‌ తిరగబెట్టడం, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, ఒబీస్‌ పేషెంట్‌ కావడం, కిడ్నీ డ్యామేజ్‌ అవడంతో ఇన్‌ఫెక్షన్‌ శరీరమంతా సోకిందని, దీంతో సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారని కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు వెల్లడించారు.