ఖైరతాబాద్ లో ఈసారి 40 అడుగుల గణేషుడి విగ్రహం

హైదరాబాద్.. ఖైరతాబాద్ లో ఈసారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలియజేసింది. ఖైరతాబాద్ లో బడా గణేష్ ఉత్సవ మూర్తి నమూనాను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.

ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో)దర్శనం ఇవ్వనుంది. ఎడమ వైపు కాలి క్రిష్ణా, కుడివైపు కాలనాగేశ్వరి విగ్రహాలు( 15 అడుగుల) ఏర్పాటు చేయనున్నారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.