ఆటో-‌ కంటైనర్ ఢీ.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - TNews Telugu

ఆటో-‌ కంటైనర్ ఢీ.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంThree killed in road accident in Sangareddy district on Sunday

సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలని అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఆటోను కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మొత్తం వివరాలు తెలియాల్సి ఉంది.