కరీంనగర్ జిల్లాలో మూడు వేర్వేరు ప్రమాదాలు.. ముగ్గురి పరిస్థితి విషమం.. దగ్గరుండి ఆస్పత్రికి పంపిన మంత్రి హరీష్ రావు

accident
accident

3 die in separate road accidents in Telangana

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం మాందాడి పల్లి గ్రామ జాతీయ రహదారిపై వరుసగా మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గ్రానైట్ లోడ్ తో కరీంనగర్ వెళుతున్న లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో  నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధే సమయంలో ఆగి ఉన్న కారును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు అటుగా వెళుతున్న మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ క్షత గాత్రులను పరిశీలించి.. 108 వాహనంలో హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదంలో ఆగి ఉన్న లారీ.. మరో వాహనాన్ని ఢీకొనడంతో  అది అదుపుతప్పి మరో లారి ఢీకొట్టింది.