పటాన్ చెరులో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య

dead body

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు మండలం భానుర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కూతురు, ఒక యువకుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు.

వివాహిత తన చిన్నారితో సహా వరుసకు మరిదితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని చనిపోయినారని, వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.

మృతులను వాసుదేవ (27), రేఖా (28), సోనం (2)గా గుర్తించారు. మృతురాలు రేఖ.. వాసుదేవ అన్న భార్య అని, వీరి ఆత్మ హత్యలపై పలు అనుమానాలు ఉన్నాయని..  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  బీడీఎల్ – భానుర్ పోలీసులు తెలిపారు.