పులొచ్చె… బర్రె సచ్చె.. భూపాలపల్లిలో భయం.. భయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గత కొద్దిరోజులుగా మండలంలోని గుమ్మళ్లపల్లి, వీరాపూర్ అటవీ ప్రాంతలో పులి సంచరిస్తుండటంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాజాగా గుమ్మళ్లపల్లి చెరువు వద్ద మేతకు వెళ్లిన బర్రెల మంద మీద పులి దాడి చేసి రెండు బర్రెలను చంపినట్టు కాపరి ఓదేలు చెప్పాడు.

Tigers Stay Tourism Packages Available From Today
పులి దాడితో భయభ్రాంతులకు గురైన ఓదేలు ఊరికి పరుగెత్తి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి. చేరుకున్నారు. అయితే.. నిన్న (సోమవారం) కూడా పులి ఓ లేగదూడపై దాడి చేసి చంపేసింది. దీంతో సమీప అటవీ ప్రాంతంలో బర్రెలను మేతకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు.