ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

CM KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంట‌ల‌కు మీడియా సమావేశం ఉంటుందని సీఎంఓ తెలిపింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీఎం ఏం మాట్లాడతారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది.