గడిచిన 24 గంటల్లో 16,862 పాజిటవ్ కేసులు.. కేరళలోనే 9,246 కేసులు నమోదు

Today Corona Report
Today Corona Report

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16,862 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. 379 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,40,37,592 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

corona report
corona report

ప్రస్తుతం దేశంలో 2,03,678 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,33,82,100 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణించిన 379మందితో కలిపి దేశంలో కరోనా మరణాల సంఖ్ 4,51,814కి చేరింది. అయితే.. కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 9,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 96 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 30,26,483మంది కేరళలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా.. దేశం మొత్తంలో 97కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.