నేటి కరోనా రిపోర్ట్ : 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

Today Corona Report
Today Corona Report

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా నమోదువుతున్న కేసుల్లో స్వల్ప హెచ్చతగ్గులున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,81,246 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో.. 10,549 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా కరోనా వల్ల 488 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే నిన్న 5,987 కేసులు, 384 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ప్రారంభం నుంచి కరోనా బారినపడిన వారి సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. 4,67,468 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఒక్కరోజే 9,868 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ రేటు 98.33 శాతం కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,10,133గా ఉంది. నిన్న ఒక్కరోజే 83,88,824 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు మొత్తం 120 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది.