నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

మంత్రి కేటీఆర్‌ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 11.30 గంటలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో సమావేశం పూర్తి చేసుకొని, 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్‌ మండలంలో యాదవ సంఘ భవనాన్ని ప్రారంభిస్తారు.