ఏంటీ విడ్డురం.. మహేష్ బాబు ఊరిని దత్తకు తీసుకుంటే.. ఈ తెలుగు నటుడు గుడ్లగూబని..!

Tollywood Actor SuryaTeja Adopt Owl Bird
Tollywood Actor SuryaTeja Adopt Owl Bird

సినిమాల్లో, రియల్ లైఫ్ లో సినీ రాజకీయ సెలబ్రెటీలు ఊర్లని, లేదంటే అనాధలని దత్తకి తీసుకోవటం మనం చూస్తుంటాం. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ బాగా ఫెమస్ అయ్యింది. తాజాగా మన ఐటి మంత్రి కేటీఆర్ కూడా ఒక సభ వేదికపై శ్రీమంతుడు సినిమాని గుర్తుకుచేసాడు. అయితే తాజాగా దత్తకు తీసుకోవటం అంశంలో ఒక తెలుగు నటుడు వినూత్నంగా అలోచించి.. విడ్డురమైన పని ఒకటి చేశాడు. అదేంటంటే మనం ఎప్పుడైనా ఓ పక్షిని దత్తత తీసుకోవడం విన్నామా? అది కూడా గుడ్లగూబని దత్తత తీసుకోవడం ఎక్కడైన చూశారా? ఇలాంటి విచిత్రమైన, ఆసక్తికర సంఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అది కూడా గుడ్లగూబని ఓ నటుడు దత్తత తీసుకోవడం విశేషం.

తెలుగు సిని నటుడు, నిర్మాత సూర్యతేజ్‌ శుక్రవారం గూడ్ల గూబని దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కుని ఆయన సందర్శించారు. అనంతరం జూపార్క్ లోని గూడ్ల గూబని ఏడాది పాటు దత్త తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన రూ.20వేల చెక్కుని జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్‌కి అందించారు. ఈ ఏడాది పాటు ఆ గుడ్లగూబకి సంబంధించి ఆహారం, సంరక్షణకు ఈ మొత్తాన్ని వెచ్చించబోతున్నట్టు తెలిపాడు సూర్యతేజ్‌. అనంతరం జూపార్క్ క్యూరేటర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ, సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపినిచ్చాడు. ఇక మొదట్లో ఈ వార్త కొంచం విడ్డురంగా అనిపించినా ఇదంతా కూడా మూగజీవాలపై ప్రేమని చూపెట్టడానికి వాటిని బ్రతికుంచుకోవడానికి వినూత్నంగా చేసే మంచి పని అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.