సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. సినీ ప్రముఖుల ప్రశంసల వర్షం..!

Tollywood Celebrities Reaction On Cm Kcr Announcement For Farmers
Tollywood Celebrities Reaction On Cm Kcr Announcement For Farmers

రైతుల గురించి సీఎం కేసీఆర్ పడే తపనకి దేశంలోని ఏ నాయకుడు మ్యాచ్ అవ్వలేడు. తెలంగాణ ప్రభుత్వ పథకాలే దీనికి నిదర్శనం. దేశంలోని చాల రాష్ట్రాలు మనం పథకాల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాయి. కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ పథకాలని బహిరంగంగా ప్రశంసిస్తూ ఆదర్శంగా తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే రైతులపై కేసీఆర్ ప్రేమకి హద్దులుండవని మరో తాజా ఘటన రుజువు చేసింది. తెలంగాణ రాకముందు అగమ్యగోచరంగా ఉండే తెలంగాణ రైతన్నల జీవితాలని బంగారుమయం చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశ రైతాంగంపై కూడా తన ప్రేమని చాటుకున్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలని వదిలిన 750మంది భారత దేశ రైతు కుటుంబాలకి మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు కేసీఆర్.

స్వతహాగా రైతు అయిన కేసీఆర్, ఉద్యమకారుడు కూడా. అందుకే దేశంలో మరే ఇతర పార్టీ కూడా చెయ్యనటువంటి గొప్పపనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచి మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు కేసీఆర్. దీంతో మన సీఎం కేసీఆర్ పై దేశం నలువైపులా నుండి ప్రశంసల వర్షం కురుస్తుండగా..   తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా కేసీఆర్ ప్రకటనని పొగుడుతూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. కేసీఆర్‌ సాయం ప్రకటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించడం గర్వంగా ఉందన్నారు.

కేటీఆర్ ట్వీట్‌కు రీట్వీట్‌ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ ప్రకటనను అభినందించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ మోదీ సారీ చెప్తే సరిపోదు. చనిపోయిన కుటుంబాల బాధ్యత తీసుకోవాలంటూ ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన నటి సమంత కూడా ధన్యవాదాలు తెలిపారు.

అటు హీరోలు నాని, రామ్‌లు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మొదలైన కేసీఆర్ రైతు ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్.. అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని.. 750 మంది రైతు కుటుంబాలకు కేంద్రం వెంటనే 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.