టీ 20 వ‌రల్డ్ క‌ప్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్‌ -5 బ్యాట్స్‌మెన్లు వీరే..

టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబర్ 17 నుంచి షురూ కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ల‌లో నవంబర్ 14 వరకు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది. పొట్టి క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్స్ లు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్ -5 లో బ్యాట్స్‌మెన్లు.. వారి వివ‌రాలు మీకోసం..

శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 2007 నుంచి 2014 వరకు టీ 20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లలో మహేలా 111 ఫోర్లు కొట్టాడు. అతను 136.74 స్ట్రైక్ రేట్‌తో 1016 పరుగులు చేశాడు.

రెండో స్థానంలో శ్రీలంక ప్లేయ‌ర్‌ తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు. 2007 నుంచి 2016 వరకు 35 మ్యాచ్‌ల్లో 101 ఫోర్లు కొట్టాడు. 30.93 సగటుతో 897 పరుగులు చేశాడు.

వెస్టిండిస్ ప్లేయ‌ర్‌ క్రిస్ గేల్ మాత్రం మూడో స్థానంలో ఉన్నాడు. 2007 లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 75 ఫోర్లు కొట్టాడు. అతను 146.73 స్ట్రైక్ రేట్ తో 920 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇంకా ఎన్ని ఫోర్లు కొడ‌తాడో చూడాలి.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. 2012 నుంచి ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. 73 ఫోర్లు కొట్టాడు. 133.04 స్ట్రైక్ రేట్‌తో 777 పరుగులు చేశాడు. ఈసారి త‌న బ్యాట్ లో మ‌రిన్ని ఫోర్లు కొడితే టాప్ ప్లేస్ కొట్లే అవ‌కాశం ఉంది.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఐదవ స్థానంలో ఉన్నాడు. 2007 నుంచి 2014 వరకు 25 మ్యాచ్‌లు ఆడి 67 ఫోర్లు కొట్టాడు. 128.42 స్ట్రైక్ రేట్ తో 637 పరుగులు చేశాడు.