విషాదం.. పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి - TNews Telugu

విషాదం.. పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతిసంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి, కొడుకు మృతి చెందిన విషాద సంఘటన మునిపల్లి మండలం మొగడంపల్లిలో చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు.. కృష్ణ (32), ప్రశాంత్(10) తండ్రి, కొడులు. తమ పొలం వద్ద పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి, కొడుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.