జనగామ జిల్లాలో విషాదం.. బతుకమ్మ పువ్వుకోసం వెళ్లిన వ్యక్తి మృతి - TNews Telugu

జనగామ జిల్లాలో విషాదం.. బతుకమ్మ పువ్వుకోసం వెళ్లిన వ్యక్తి మృతి 

a man was killed in a scuffle for rs.100 in khammam district

జనగామ జిల్లాలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ పువ్వుకోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించాడు. దీంతో అతని గ్రామంలో విషాదం నెలకొంది.

స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ కు చెందిన సుంచు వెంకటేశ్వర్లు(50) పండుగ వేళ బతుకమ్మ పువ్వుకోసం వెళ్లాడు. పూవ్వుల కోసం చెట్టు ఎక్కిన వెంకటేశ్వర్లు..  ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడటంతో మృతి చెందాడు.