మెదక్ జిల్లాలో విషాదం.. డ్యామ్ లో దూకి జంట ఆత్మహత్య

drown

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హావేలి ఘనాపూర్ మండలంలోని పోచారం డ్యామ్ లో దూకి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.

మృతులు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్ పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సంతోష్ (30), రాణవ్వ (28) గా గుర్తించారు.

వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై ఇరు కుటుంబాల్లో గొడవ జరగడంతో డ్యామ్ లో దూకి వారు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.