రంగారెడ్డి జిల్లాలో విషాదం. ప్రమాదవశాత్తు మూడేండ్ల బాలిక మృతి

రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేండ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది.

నీటి సంపుకు ఉన్న మూత తెరిచి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మృతురాలు కొల్లాపూర్ కు చెందిన సన, జగదీష్ నాయక్ ల కూతురు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.