సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతి - TNews Telugu

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతిTragedy in Sangareddy district .. Two died after drowning in a pond

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటే వారి పాలిట మృత్యు పాశమైంది. చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సాయిలు(35), సంగమేశ్వర్(23) లు ఆదివారం రాత్రి వారి పొలానికి వెళ్తుండగా దారిలో ఉన్న చెరువులో చేపలు పడదామనే ఉద్దేశంతో అందులోకి దిగారు. లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారు.

పొలానికి వెళ్లిన వారు తెల్లవారినా ఎంతకూ ఇంటికి రాకపోవడంతో సాయిలు భార్య చేను వద్దకు వెళ్లి చూడగా చెరువు వద్ద ఇద్దరి చెప్పులు కనబడ్డాయి. చెరువులో మునిగిపోయారని గ్రామ సర్పంచ్ జగదీష్ చారికి తెలపడంతో ఆయన అక్కడికి చేరుకొని ని గాలింపు చర్యలు నిర్వహించారు. చెరువులో నుంచి ఇద్ద‌రు మృత‌దేహాల‌ను స్థానికుల సాయంతో వెలికితీశారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న నారాయణఖేడ్ ఎస్ ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి మృతితో నిజాంపేట్ గ్రామంలో విషాదఛాయలు అలుముకుంది.