సొరంగలో రైలు ప్రమాదం.. 36 మంది మృతి

తైవాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గంలో వెళ్తున్న రైలు పట్టాలు తప్పింది.  ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 72 వరకు తీవ్రంగా గాయపడినట్లు తైవాన్ రవాణా మంత్రిత్వశాఖ చెప్పింది. ఈ రైలు టైటంగ్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ రైలులో 350 వరకు ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో పెద్ద ఎత్తున రోధనలతో మిన్నంటాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడంతో సహాయక బృందాలకు లోపలికి పోవడం కష్టతరంగా మారింది.