సినీ దర్శకురాలి పై  రాజద్రోహం కేసు..!

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ పై ఆరోపనలు చేసిన సినీ దర్శకురాలి పై రాజద్రోహం కేసు నమోదయింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కేంద్రం పంపిన జీవాయుధమని సినీ దర్శకురాలు ఐషా సుల్తానా ఆరోపించింది. కొవిడ్ ను కట్టడి చేయడంలో ఆయన విఫలమయ్యారంటూ.. పలు టీవి కార్యక్రమాల్లో మాట్లాడింది. ఐషా సుల్తానా చేసిన ఆరోపనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆమెపై రాజద్రోహం కేసు నమోదయింది.