త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామాను త్రిపుర గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యకు సమర్పించారు.
మరో ఆరు నెలల్లో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతటి కీలక పరిస్థితుల్లో సీఎం విప్లవ్ దేవ్‌ను బీజేపీ అధిష్ఠానం తప్పించడం కొత్త చర్చకు దారితీసింది.
విప్లవ్ దేవ్ రాజీనామా నేపథ్యంలో ఇవాళ సాయంత్రం బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది. ఈ భేటీలోనే కొత్త సీఎంను బీజేపీ అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉంది. 2018 లో విప్లవ్ దేవ్ త్రిపుర సీఎంగా ఎన్నికయ్యారు.