ఇద్దరు పిల్లల తల్లివి.. ఆ బట్టలేంటి.. బాలీవుడ్ అర్జున్ రెడ్డి భార్యపై విమర్శలు.. వీడియో వైరల్..!

Trolling On Shahid Kapoor Wife Dressing In Social Media
Trolling On Shahid Kapoor Wife Dressing In Social Media
Trolling On Shahid Kapoor Wife Dressing In Social Media
Trolling On Shahid Kapoor Wife Dressing In Social Media

టాలీవుడ్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. సరైన హిట్ కోసం తహతహలాడుతున్న షాహిద్ కెరీర్ గ్రాఫ్ ని రెట్టింపు చేసిన చిత్రం కబీర్ సింగ్. ఆ తరువాత కూడా అదే తెలుగు రీమేక్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ నాని జెర్సీ మూవీని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు షాహిద్. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ మీడియా లోను షాహిద్ కి మంచి క్రేజ్ దక్కింది. ఈ క్రమంలో తాజాగా అతని భార్య మీరా రాజ్‌పుత్‌ పై విపరీతంగా ట్రోల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు పిల్లల తల్లై ఉండి ఆ పొట్టి నిక్కర్లు వేసుకోవటం ఏంటి అంటూ కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. నెట్‌ వాడకం పెరిగి సోషల్‌ వాడకం విస్తృతమైన ఈ తరుణంలో మీరాపై నెగిటీవ్ ట్రోలింగ్ చేస్తున్నారు బీ టౌన్ నెటిజన్స్.

ఇటీవలే షాహిద్ మీరాల జంట పిల్లలతో కలిసి మాల్దీవులలో హాలిడే ట్రిప్ ముగించుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోపై భయంకరమైన ట్రోలింగ్ అవుతుంది.    ఈ వీడియోలో షాహిద్ కపూర్ వారి ఇద్దరు పిల్లలు పూర్తి బట్టలు వేసుకుని ఉంటే.. బ్లాక్ డెనిమ్ షార్ట్స్ లో మీరా రాజ్ పుత్ ఆల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తుంది. అయితే భర్త, పిల్లలు పద్దతిగా ఉంటే.. భార్య మాత్రం పొట్టి బట్టలు వేసుకుంది అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ‘నాకు పురుషులపై రోజు రోజుకి గౌరవం పెరిగిపోతోంది. ఎందుకంటే వారు పూర్తిగా దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. పురుషులందరికీ వందనాలు’ అంటూ తీవ్రంగా కామెంట్‌ పె​ట్టాడు మరో నెటిజన్‌. అయితే బాలీవుడ్‌ స్టార్‌ భార్య అయిన మీరాపై ట్రోలింగ్ జరగటం ఇది కొత్తేమి కాదు. చాల సార్లు తన వస్త్రధారణ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నఈ బాలీవుడ్ అర్జున్ రెడ్డి భార్య మీరా మాత్రం తన ట్రోలింగ్ పై ఒక్కసారి కూడా స్పదించకపోవటం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)