ఈ ఇద్దరు మాకొద్దురో..!

Trolling On Team India Players Ajinkya Rahane And Pujara
Trolling On Team India Players Ajinkya Rahane And Pujara

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా సీనియర్స్ పుజారా, అజింక్యా రహానేలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఈజీగా గెలుస్తారనుకున్న సమయంలో నాలుగో రోజు భారత బ్యాటింగ్ తడబడింది. ఆ జట్టు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానేలు మరోసారి ఫ్లాప్‌ అయ్యారు. పుజారా (22) జైమీసన్ వేసిన బంతిని వికెట్ కీపర్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చాడు. గత 40 ఇన్నింగ్స్‌ల్లో పుజారా సెంచరీ చేయలేదు. అతను తన చివరి టెస్ట్ సెంచరీని 3 జనవరి 2019న ఆస్ట్రేలియాపై సాధించాడు.

అదే సమయంలో కెప్టెన్ అజింక్యా రహానె అయితే మరీ ఘోరంగా విఫలం అవుతున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 4పరుగులకే రహానెని అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఈ ఏడాది రహానే 12 మ్యాచ్‌లు ఆడి 411 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని సగటు 19.57గా నిలిచింది. అతని బ్యాట్‌ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. 2021లో అతని బ్యాట్ నుంచి కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల నిరంతర పేలవ ప్రదర్శనతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. నెటిజన్లు వీరిపై చాలా కోపంగా ఉన్నారు. క్రియేటివ్ కామెడీ మీమ్స్ తో ఈ ఇద్దరిపై ట్రోలింగ్ నడుస్తుంది.