జనాలకి అర్ధం కానీ భాషతో తికమకగా మాట్లాడుతూ బండి సంజయ్ నవ్వుల పాలవ్వటం సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటాం. కంటెంట్ లేని కామెంట్స్ చేయటం బండి స్పెషల్. అయితే ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకా కూడా విషయ పరిజ్ఞానం లేకుండా నోటికొచ్చిన హామీలు ఇస్తూ బండి సంజయ్ తెలంగాణలో పేద కామెడీ పీస్ అయిపోతున్నాడు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్న రీతిలో తన పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్థాయికి మించిన వ్యాఖ్యలు చేస్తూ మూడోవిడత పాదయాత్రలో నవ్వుల పాలవుతున్నారు. ఎక్కడైనా ప్రైవేటులో ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉచిత విద్య ఏవిధంగా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతవరకు ఎందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల్లో బండి పోతే బండి ఫ్రీ.. అని హామీ ఇచ్చారు బండి సంజయ్. అది ఏమైంది అని ప్రజలు నిలదీస్తున్నారు. హామీల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజల్లో బండి చులకన అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన గ్లోబెల్స్ ప్రచారంతో బీజేపీ బండిని నెట్టుకొస్తున్నారని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఆయన మాటల డొల్లతనానికి ప్రణాళిక లేని ఉచిత విద్య వైద్యం హామీనే తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు.