ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా: గెల్లు శ్రీనివాస్ యాదవ్

TRS candidate Gellu Srinivas' election campaign in Kamalapur constituency Uppal

TRS candidate Gellu Srinivas' election campaign in Kamalapur constituency Uppal

హనుమకొండలోని కమలాపూర్ మండలం ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ తీసుకొస్తానన్నారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్‌పై దుష్ప్రచారం చేసున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ లక్షా 30వేల ఉద్యోగాలిచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని శ్రీనివాస్ అన్నారు.

ఎన్నికల్లో బీజేపీ కుట్రలకు తెరలేపుతుందని ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీ దుర్మార్గపు ఆలోచనలు చేస్తుందన్నారు. ఈ నెల 12, 13 , 14 తేదీల్లో ప్రచారం లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటల పై దాడి చేసినట్లు క్రియేట్ చేయాలనీ దుర్మార్గపు ప్లాన్ చేస్తున్నారన్నారు. తనపై తన మనుషుల చేత దాడి చేయించుకొని టీఆర్ఎస్ పై నెపం వేయాలని నీచమైన ఆలోచన చేస్తున్నాడన్నారు. కాళ్లకు చేతులకు కట్లు కట్టుకొని, ప్రజల సానుభూతి పొందెందుకు ఎన్నికల ప్రచారం చేయాలనీ చేస్తున్నాడన్నారు. తమకు దీనిపై పక్కా సమాచారం ఉందని, బీజేపీ కి ఇలాంటి కుట్రలు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. మొన్న రఘనందనరావు ,నిన్న బండి సంజయ్, ఇవాళ ఈటల.. ఇలాంటి కుట్రలకు ప్లాన్ చేస్తున్న బీజేపీ కి ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.