హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెల్లు శ్రీనివాస్ ఓటమి

The nomination process for the Huzurabad by-election will begin from today

State Election Commissioner Shashank Goel said the election code would come into force in Huzurabad constituency from today.

క‌రీంన‌గ‌ర్‌ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. కరీంనగర్ లోని ఎస్సారార్‌ డిగ్రీ కాలేజీలో 22 రౌండ్ల‌లో ఓట్ల‌ను లెక్కించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 24,068 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు 82,712 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌కు 1,06,780 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌కు 3,012 ఓట్లు మాత్ర‌మే రావడంతో డిపాజిట్ కూడా దక్కలేదు.