ప్లీనరీలో వడ్డించిన వంటకాలివే.. చెప్తుంటేనే నోరూరిపోతోంది

trs Plenary Special Food Menu
trs Plenary Special Food Menu
trs Plenary Special Food Menu
trs Plenary Special Food Menu

టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. మూడేండ్ల తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీకి 15వేల మంది హాజరవుతున్నారు. మాధాపూర్ లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న పార్టీ ప్లీనరీకి అంచనాలకు మించి ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అంటేనే వంటకాలకు ప్రత్యేకం. అందులో తెలంగాణ వంటకాలకు పెద్దపీట వేస్తారు. దీనికి తగ్గట్టుగా ఈ సారి టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా తెలంగాణ సంస్కృతి, ఆహార అలవాట్లను ప్రతిబింబించేలా మెనూ ప్రిపేర్ చేశారు. వెజ్, నాన్ వెజ్, రోటీ, పచ్చళ్లు, ఇరానీ ఛాయ్ వంటి ఘుమఘుమలాడించే వంటకాలు ప్లీనరీకి హాజరు కానున్న వారికి వడ్డించనున్నారు.


ఈ సారి ప్లీనరీలో తెలంగాణ రుచులతో పాటు.. రాయలసీమ రాగిసంకటి కూడా చేర్చారు. ఛాయ్ నుంచి ఐస్ క్రీమ్ వరకు మొత్తం 34 రకాల వంటకాలు ప్లీనరీలో సిద్ధం చేస్తున్నారు. 9 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో ధమ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాసా సూప్, తలకాయ పులుసు ఉన్నాయి.

trs Plenary Special Food Menu
trs Plenary Special Food Menu

వెజిటేరియన్ లో స్పెషల్ రోటీ, పచ్చళ్లు, మూడు రకాల స్వీట్లు, గుత్తి వంకాయ కూర, జీడిపప్పు బెండీ ఫ్రై, రాగి సంకటి, రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా అన్నం, వెజ్ బిర్యాని, తెల్లన్నం, చామగడ్డ చారు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు, వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ, పెరుగు, పెరుగు చట్నీ, వడియాలు, జిలేబీ, డబుల్‌కా మీటా నోరూరించే వంటకాలు ప్లీనరీ ప్రతినిధులు, ప్లీనరీ విధుల్లో ఉండే కార్యకర్తలు, వాలంటీర్లు, పలు విభాగాల ఉద్యోగులు, జర్నలిస్టులకు వడ్డించారు.