కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. లోపాయకారి ఒప్పందం చేసుకొని టీఆర్ఎస్ ను ఓడించగలమని భ్రమలు పడుతున్నారు. మీరు ఎన్నిఎత్తుగడలు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.. గెల్లు శ్రీనివాస్ ని గెలిపిస్తారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మానిక్కం ఠాకూర్ రూ.50 కోట్లకు టీపీసీసీ ఛైర్మన్ సీటు అమ్ముకున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. అమరీందర్ సింగ్ కూడా ఇదే మాట చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు.

KTR About Trs Party And Telangana Development

ఆరెస్సెస్ మూలాలు ఉన్న వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని.. ఆ పార్టీ సీనియర్ నాయకులే నిలదీస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో చీకటి ఒప్పందం కుదుర్చుకునే గెలిచాయి. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే పని చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ గోల్కొండలో కలుసుకున్నారు అక్కడ వాళ్లను చూసిన వాళ్ళే మాకు చెప్తున్నారు. దళిత బంధు ఎన్నికలకు ముందే అమలు చేశాము. ఇప్పుడు ఎందుకు ఆపారో ఎన్నికల కమిషన్ కే తెలియాలి. ఎన్నికలు జరిగే ప్రాంతంలో కాకుండా.. మిగతా ప్రాంతాల్లో కూడా సభలు పెట్టొద్దనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.