సాధారణ డెలివరీపై టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం

delivery

సాధారణ డెలివరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవం చేసిన డాక్టర్లకు రూ.3వేలు ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నార్మల్ డెలివరీ తో తల్లికి, శిశువుకు మేలు చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవం వల్ల మొదటి గంటలో తల్లి పాలు అందడటంతో పాటు శిశువుకు ఆరు నెలల పాలు అందుతాయని..దీంతో శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి.