తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

Tirumala

తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన వీఐపీ విరామ సమసయంలో శ్రీనివాసుడి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు.


తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. లాభాల బాట పట్టాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని.. సంతోషంగా వెళ్లడం కోసం ఆర్టీసీ బస్సులు ఎక్కాలని ఆయన కోరారు. కరోనా కారణంగా తక్కువ సర్వీసులు నడుపుతున్నామని.. త్వరలోనే పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి తిరుపతికి నడిచే బస్సుల సంఖ్య త్వరలో పెంచుతామని ఆయన అన్నారు.