ఆ 10 రోజులపాటు వీఐపీ సిఫారసు లేఖలు తీసుకోం: టీటీడీ

tirumala

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు మొత్తం పది రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపి లు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే, విఐపీలు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.