ఆరు రోజుల చార్‌ధామ్ యాత్ర‌లో 20 మంది మృతి

ఉత్త‌రాఖండ్‌లో చార్‌థామ్ యాత్ర ప్రారంభ‌మై కేవ‌లం ఆరు రోజులే అవుతోంది. ఈ ఆరు రోజుల్లోనే ఇప్ప‌టికే 20 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. చార్‌థామ్ యాత్ర‌లో ఎక్కువ‌గా న‌డ‌క ఉండ‌డం వ‌ల్ల.. అందులో ఎక్కువ శాతం భ‌క్తులు వృద్ధులు కావ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న‌ట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెన‌స్‌తో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. ఈ నెల 3వ తేదీన గంగోత్రి, య‌మునోత్రి, కేదార్‌నాథ్‌ను మే 6వ తేదీన‌, బ‌ద్రీనాథ్‌ను మే 8వ తేదీన భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే.

య‌మునోత్రి, గంగోత్రి థామ్‌ల వ‌ద్ద సోమ‌వారం నాటికి 14 మంది ప్ర‌యాణికుల‌తో పాటు ఓ నేపాలీ కార్మికుడు తుదిశ్వాస విడిచిన‌ట్లు చార్‌థామ్ యాత్ర అడ్మినిస్ట్రేష‌న్ వెల్ల‌డించింది. అలాగే కేదార్‌నాథ్‌లో అయిదుగురు, బ‌ద్రీనాథ్‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చార్‌థామ్ బోర్డు తెలిపింది.