రాజేంద్రనగర్‌లో తల్లిసహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

Two children, including a mother, go missing in Rajendranagar, hyderabad

Two children, including a mother, go missing in Rajendranagar, hyderabad

హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్ లోని ఎమ్‌ఎమ్‌పహాడిలో అమ్రీన్ అనే మహిళ.. తన పిల్లలు అక్షబేగం, అజా బేగంలతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లింది. కాగా సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త అబ్రార్ సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశారు. చుట్టూ పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అబ్రార్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.