ఎల్బీనగర్‎లో విషాదం.. మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు GHMC కార్మికులు గల్లంతు

Two GHMC workers died of suffocation after cleaning manhole for drainage cleaning

Two GHMC workers died of suffocation after cleaning manhole for drainage cleaning

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‎లోని విషాదం చోటుచేసుకుంది. స్థానిక సాహెబ్‎నగర్‎లో డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు.. ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికులు క్లీనింగ్ చేస్తుండగా ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జీహెచ్ఎంసీ కార్మికులు అంతయ్య, శివగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Two GHMC workers died of suffocation after cleaning manhole for drainage cleaning