చెట్లకు నీరు పోస్తున్న కార్మికులను ఢీకొట్టిన కారు.. ఇద్దరు వ్యక్తులు మృతి

Accident

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

IDA బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై చెట్లకు నీరు పోస్తున్న కార్మికులకు కారు ఢీ కొట్టింది. ఈ దర్ఘటనలో నీళ్ల ట్యాంకర్ క్లీనర్ నవీన్ (19), కార్మికుడు సత్తయ్య (50) ఘటనా స్థలంలోనే మరణించారు.

ప్రమాదానికి కారణమైన కారు.. మేడ్చల్ నుండి పఠాన్ చెరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.