ఆటో, లారీ ఢీ.. స్పాట్ లో ఇద్దరు మృతి

accident

ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రెబ్బన మండలం దేవులగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో, లారీ రెండూ ఢీకొట్టుకోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Accident
Accident

పోలీసులు క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మృతులు తెనుగుగూడకు చెందిన గీత, గణేష్ లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.