వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త టీమ్ లు.. పేర్లేంటో తెలుసా?

Two new teams Added in Ipl 2022
Two new teams Added in Ipl 2022

వచ్చే ఏడాది ఐపీఎల్ హంగామాలో రెండు టీమ్స్ జత కలువబోతున్నాయి. మొత్తం ఆరు నగరాల జాబితా విడుదల చేసిన ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ 2022 15వ సీజన్ లో చేరబోయే రెండు జట్లేవో ప్రకటించింది. ఈరోజే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఆరు పట్టణాలలో రెండింటి నుంచి కొత్త జట్లు ఉండబోతున్నాయి.

Two new teams Added in Ipl 2022
Two new teams Added in Ipl 2022

టెండర్ల వివరాలను ప్రకటించిన ఐపీఎల్ యాజమాన్యం వచ్చే ఏడాది నిర్వహించనున్న 15వ సీజన్ ఐపీఎల్ 2022లో అహ్మదాబాద్, లక్నో నగరాల జట్లు ఐపీఎల్ పోరులో తలపడుతాయి. అహ్మదాబాద్ ఫ్రాంచైజని సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్ , లక్నో జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్నాయి. ఈ జట్లు చేరడంతో వచ్చే ఏడాది ఐపీఎల్ లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరనుంది. లక్నో జట్టు కోసం సంజీవ్ గోయెంక రూ7వేల కోట్లు బిడ్ వేశాడు. కాగా.. అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ రూ.5ేవల కోట్లతో బిడ్ వేసింది. ఈ బిడ్డింగ్ లో కొత్త ఫ్రాంచైజీల బేస్ ధరను ఐపీఎల్ రూ.2 వేల కోట్లుగా నిర్ణయించింది.