ఇద్దరు ముగ్గురు కలిసి 30-40 లక్షలతో పెద్ద వ్యాపారం కూడా చేయొచ్చు: మంత్రి సబిత

Minister Sabita Indrareddy

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేది దళిత బంధు పథకం అని, తెలంగాణ లో సామాజిక సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన అతి గొప్ప కార్యక్రమమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. రాష్ట్ర వ్యాప్త అమలులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు 100 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దళిత బంధు పథకం అమలుపై ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సాయంత్రం మంత్రి సమీక్షించారు. గతంలో దళితుల కోసం అమలు చేసిన పథకాలు వారి వికాసానికి ఏ మాత్రం తోడ్పాటు అందించకుండా పోయాయని ఎంతగానో ఆలోచించి ముఖ్యమంత్రి యూనిట్లు నెలకొల్పి ఆర్థిక స్వాలంభన సాధించటానికి 10 లక్షల రూపాయలు బ్యాంక్ లతో సంబంధం లేకుండా నేరుగా దళితులకు ఇవ్వాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

ఒక కుటుంబానికి ఒక యూనిట్ 10 లక్షల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నేరుగా లబ్దిదారుని అకౌంట్ లో తిరిగి చెల్లించే భారం లేకుండా పూర్తి గ్రాంటు రూపంలో అందజేస్తుందని, దీనితో లబ్దిదారునికి వాయిదాల ఆందోళన ఉండదన్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గ లతో పాటు  మొదటి విడత లో 100 మంది చొప్పున 400 మందిని అధికారులు పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు.

ఒక్కో నియోజకవర్గనికి ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించి లబ్ధిదారుల ఎంపిక ను పర్యవేక్షిస్తారని తెలిపారు. నవాబుపేట్ మండలం జాబితా రంగారెడ్డి జిల్లాలో ఉంటుందన్నారు. శాసన సభ్యుల నిర్ణయం మేరకు వారి నియోజకవర్గ ములో ఈ నెలాఖరు లోపు జాబితా ఇవ్వాలని, ఫిబ్రవరి 5 వ తేదీ నుండి మంజూరు ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

దళిత రక్షణ నిధి కూడా ప్రభుత్వం పది వేలు,లబ్దిదారుని నుండి 10 వేలు కల్పి ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.వికారాబాద్ జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నట్లు  సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు వచ్చాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 39 వేల 749 కుటుంబాలు గుర్తించునట్లు, కానీ కుటుంభ సమగ్ర సర్వే ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ వర్చువల్ మీట్ లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య , మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.