డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మహిళలు మృతి

Two women were killed when a car collided with a divider

Two women were killed when a car collided with a divider

హైదరాబాద్‌ నగర శివార్లలోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర మండలంలోని యాద్దార్‌పల్లి వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు మేడ్చల్ వాసులుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.