ఖార్కివ్ ను మళ్లీ దక్కించుకున్న ఉక్రెయిన్

రష్యా సరిహద్దులో ఉన్న ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ప‌ట్ట‌ణాన్ని ఇటీవల రష్యా చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను సమర్థవంతంగా తిప్పికొట్టి మళ్లీ ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. ర‌ష్యా ద‌ళాల్ని స‌మ‌ర్థ‌వంతంగా వెన‌క్కి పంపిస్తోంది. ఖార్కివ్ ను తాము మళ్లీ గెలిచుకున్నట్లు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. గ‌డిచిన రెండు వారాల నుంచి ఖార్కివ్‌ ప్ర‌శాంతంగా ఉన్న‌ట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ స‌మీప ప్రాంతాల‌పై మాత్రం ర‌ష్యా ఇంకా బాంబు దాడులు చేస్తూనే ఉంది. అటు ర‌ష్యా ఆక్ర‌మ‌ణ నుంచి దేశానికి విముక్తి ల‌భించే విధంగా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.