లైంగిక వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్

Suicide

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ధంజతండాలో రాతిని అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి లైంగిక వేధింపులు భరించలేకనే రాతిని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.