పట్ట పగ్గాల్లేని పెట్రోల్.. మళ్లీ పెరిగిన ధర

పెట్రోల్ ధరలు పట్ట పగ్గాల్లేకుండా దూసుకుపోతుంది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 36 పైసలు పెరిగింది. అయితే డీజిల్ ధర స్వల్పంగా 16 పైసలు తగ్గడం కాస్తా ఊరట. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51కు చేరగా.. డీజిల్‌ 97.62కు దిగింది.

ఇగ దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.54, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ రూ.107.54, డీజిల్‌ రూ.97.45.. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.101.74, డీజిల్‌ రూ.93.02.. భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.89, డీజిల్‌ రూ.98.67గా ధరలు ఉన్నాయి.