దొంగల హల్ చల్.. 3 ట్రేల టమాటాలు చోరీ

Unidentified persons stole 4 trays of tomatoes in Krishna district

టమాటా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే టాపిక్. నెల రోజుల్లోనే టమాటా ధరలు పెట్రోల్ ధరలను దాటేసి రికార్డు సృష్టించాయి. చికెన్ తోనూ టమాటలు పోటీ పడ్డాయి. ఇక ప్రైవేటు మార్కెట్లలో..చిన్న చిన్న షాపుల్లో టమాట కొనాలంటే సామాన్యుడి నెలసరి బడ్జెట్ సరిపోవట్లేదు. ఇక కొన్ని షాపుల్లో కిలో టమాట 200ల రూపాయలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కిలో టమాట విలువ రోజురోజుకీ పెరుగుతుండడంతో టమాటా దొంగతనం చేసేంత ఖరీదైన వస్తువైపోయింది.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొందరు దొంగలు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని టమాటాల దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కా ప్రణాళికతో సీసీ కెమెరాలకు చిక్కకుండా మాయం చేశారు. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 3 ట్రేల టమాటాలను దొంగలించారు. ఒక్కో ట్రే టమాటాల ధర రూ.3000 వరకూ ఉంటుందని బాధితులు అంటున్నారు. టమాటా రేటు రూ.100పైనే పలుకుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.